కశ్మీరీ కహ్వా టీ

ABN , First Publish Date - 2021-12-22T17:58:35+05:30 IST

నీళ్లు- 2 కప్పులు, దాల్చిన చెక్క- రెండు, యాలకులు- రెండు, లవంగాలు- రెండు, గులాబీ రేకులు - అయిదు, చక్కెర - రెండు స్పూన్లు, గ్రీన్‌ టీ ఆకులు- స్పూను, బాదం పప్పు - నాలుగు, కుంకుమ పువ్వు - 10.

కశ్మీరీ కహ్వా టీ

కావలసిన పదార్థాలు: నీళ్లు- 2 కప్పులు, దాల్చిన చెక్క- రెండు, యాలకులు- రెండు, లవంగాలు- రెండు, గులాబీ రేకులు - అయిదు, చక్కెర - రెండు స్పూన్లు, గ్రీన్‌ టీ ఆకులు- స్పూను, బాదం పప్పు - నాలుగు, కుంకుమ పువ్వు - 10.


తయారుచేసే విధానం: సుగంధ ద్రవ్యాలన్నిటినీ పొడి చేసుకోవాలి. టీ గిన్నెలో నీళ్లు వేసి ఉడికించాలి. ఇందులో కాస్త పొడిని, గులాబీ రేకుల్ని, చక్కెరని కలపాలి. బాగా మరిగాక స్టవ్‌ కట్టేయాలి. దీంట్లోనే గ్రీన్‌ టీ ఆకులు వేసి మూతపెట్టాలి. మూడు నిమిషాల తరవాత ఈ ద్రవాన్ని వడగడితే వేడి వేడి కశ్మీరీ కహ్వా టీ రెడీ. కప్పుల్లోకి వంచుకుని పైన బాదం, కుంకుమ పువ్వును వేస్తే సరి.

Updated Date - 2021-12-22T17:58:35+05:30 IST