కార్వీ అక్రమాలను నిగ్గు తేల్చిన సీసీఎస్‌ పోలీసులు

ABN , First Publish Date - 2021-08-28T23:03:03+05:30 IST

కార్వీ అక్రమాలను సీసీఎస్‌ పోలీసులు నిగ్గు తేల్చారు. ఖాతాదారులకు కార్వీ రూ.780 కోట్ల కుచ్చుటోపి పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు

కార్వీ అక్రమాలను నిగ్గు తేల్చిన సీసీఎస్‌ పోలీసులు

హైదరాబాద్‌: కార్వీ అక్రమాలను సీసీఎస్‌ పోలీసులు నిగ్గు తేల్చారు. ఖాతాదారులకు కార్వీ రూ.780 కోట్ల కుచ్చుటోపి పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కార్వీ చీటింగ్‌ మొత్తం రూ.2700 కోట్లుగా పోలీసులు తేల్చారు. కార్వీ ఆస్తుల మొత్తాన్ని బ్యాంకుల్లో పార్థసారధి కుదువ పెట్టాడు. రూ.13 కోట్ల లిక్విడ్‌ క్యాష్‌ను పోలీసులు గుర్తించారు. పార్థసారధి రెండ్రోజుల పోలీస్‌ కస్టడీలో పూర్తి ఆధారాలు సేకరించారు. రూ.780 కోట్ల షేర్లను పార్థసారధి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. షేర్లలో పెద్దమొత్తంలో నష్టపోయినట్లు పార్థసారధి చెబుతున్నాడు. ఖాతాదారులకు సెబీతోపాటు తన ఆస్తులను అమ్మి న్యాయం చేస్తానని తెలిపారు. పార్థసారధి పీటీ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-28T23:03:03+05:30 IST