Karimnagar ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉప ఎన్నిక వివి ప్యాట్ కలకలం

ABN , First Publish Date - 2021-10-31T15:00:05+05:30 IST

రీంనగర్‎లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో హుజురాబాద్ ఉప ఎన్నిక వివి ప్యాట్ కలకలం రేపింది. ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి వివి ప్యాట్ తరలింపు వీడియో శనివారం రాత్రి వైరల్

Karimnagar ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉప ఎన్నిక వివి ప్యాట్ కలకలం

కరీంనగర్: కరీంనగర్‎లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో హుజురాబాద్ ఉప ఎన్నిక వివి ప్యాట్ కలకలం రేపింది. ఒక వాహనం నుంచి మరో వాహనంలోకి వివి ప్యాట్ తరలింపు వీడియో శనివారం రాత్రి వైరల్ అయింది. రోడ్డుపై వివి ప్యాట్‎ను తరలించిన వ్యక్తిని బీజేపీ శ్రేణులు నిలదీశారు. అక్కడికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉప ఎన్నికకు ముందు పని చేయనవి వివి ప్యాట్ ను అధికారిక వాహనం నుంచి మరోక అధికారం వాహనంలో తరలించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. గోదాంకు తీసుకువెళ్తున్న దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేశారని..అది నిజం కాదని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-31T15:00:05+05:30 IST