Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొలిక్కి వచ్చిన కరణం రాహుల్ కేసు

విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన కరణం రాహుల్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఆర్థిక లావాదేవీల కారణంగానే రాహుల్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రాహుల్ ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. రాహుల్ హత్యలో విజయవాడకు చెందిన ఓ ఫైనాన్స్ వ్యాపారి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  


డీవీ మ్యానర్‌ హెటల్‌ పక్కసందులో ఆగి ఉన్న ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో గురువారం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడ్ని తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌గా గుర్తించారు. అతడిని జి. కొండూరులో‌లోని  గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యజమానిగా పోలీసులు గుర్తించారు. రాహుల్‌ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్‌ అదృశ్యంపై పేనమలూరు పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారని ఏసీపీ ఖాదర్‌ బాషా తెలిపారు. ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 


Advertisement
Advertisement