కపిల్ దేవ్‌కు గుండెపోటు

ABN , First Publish Date - 2020-10-23T20:42:55+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. 61 ఏళ్ల కపిల్‌ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఫోర్టిస్

కపిల్ దేవ్‌కు గుండెపోటు

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. 61 ఏళ్ల కపిల్‌ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై వార్తలు రాగానే ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కపిల్ ఆరోగ్యంపై పలువురు సీనియర్ క్రికెటర్లు స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిలషించారు. 


ఇదిలా ఉంటే .. 1983 చరిత్రాత్మక వన్డే వరల్డ్ కప్‌ సాధించిన భారత జట్టుకు కపిల్ కెప్టెన్. ఆ సిరీస్‌లో తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కపిల్ ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్... 9000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సాధించారు.   

Updated Date - 2020-10-23T20:42:55+05:30 IST