నిలకడగానే కపిల్‌దేవ్ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-10-23T23:02:48+05:30 IST

61 ఏళ్ల కపిల్ నిన్న రాత్రి గుండెపోటుతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల అనంతరం అర్ధరాత్రి దాటాక అత్యవసర

నిలకడగానే కపిల్‌దేవ్ ఆరోగ్యం

న్యూఢిల్లీ: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు ఆయనకు నిర్వహించిన యాంజియోప్లాస్టీ విజయవంతమైనట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 61 ఏళ్ల కపిల్ నిన్న రాత్రి గుండెపోటుతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరాడు. పరీక్షల అనంతరం అర్ధరాత్రి దాటాక అత్యవసర కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఆ తర్వాతి నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ వారాంతంలో కపిల్‌ను డిశ్చార్జ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. 1983లో భారత్‌కు ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ 1994లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

Updated Date - 2020-10-23T23:02:48+05:30 IST