ఆన్‌లైన్‌లో నిఖా.. పక్కా చేసుకున్న కాన్పూర్ అమ్మాయి, దుబాయ్ అబ్బాయి

ABN , First Publish Date - 2020-05-31T01:07:50+05:30 IST

కాన్పూర్ అమ్మాయి, దుబాయ్ అబ్బాయి లాక్‌డౌన్ టైంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అదేంటి అటు దుబాయిలోనూ.. ఇటు ఇండియాలోనూ లాక్‌డౌన్ ఆంక్షలను

ఆన్‌లైన్‌లో నిఖా.. పక్కా చేసుకున్న కాన్పూర్ అమ్మాయి, దుబాయ్ అబ్బాయి

దుబాయి: కాన్పూర్ అమ్మాయి, దుబాయ్ అబ్బాయి లాక్‌డౌన్ టైంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అదేంటి అటు దుబాయిలోనూ.. ఇటు ఇండియాలోనూ లాక్‌డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేయలేదుగా? అంతేకాకుండా జన సమూహాలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి అని అనుకుంటున్నారా? అవును మీరు ఆలోచించేంది కరక్టే. కానీ ఇంటర్నెట్‌ ద్వారా పెళ్లి చేసుకుంటే ఈ ఆంక్షలు వర్తించవు కదా.. అందుకే వారి కుటుంబ సభ్యులు ఇంటర్నెట్‌ను ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


కాన్పూర్‌లో లెదర్ వ్యాపారి అయిన అసద్ ఇరాకీ.. తన కూతురు టుబాను, దుబాయి‌లో వ్యాపారవేత్త అయిన వకీల్ అహ్మద్ కుమారుడు అసీమ్‌‌కు ఇచ్చి దుబాయిలో ఏప్రిల్ 12న వివాహం చేయాలనుకున్నారు. సుమారు 300 మంది బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభంగా నిఖా జరిపించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియా, దుబాయిలో లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో టుబా, అసీమ్‌ల వివాహం వాయిదా పడింది. తాజా పరిస్థితులపై ఇరు కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం ఫొన్‌లో చర్చించుకున్నారు. పెళ్లిని ఆన్‌లైన్‌లో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో లైవ్‌లో బంధువులు వీక్షిస్తుండగా.. మే 28న టుబా, అసీమ్ ఆన్‌లైన్‌లో నిఖా చేసుకుని ఒక్కటయ్యారు.   


Updated Date - 2020-05-31T01:07:50+05:30 IST