రైతాంగంపై అమ్మవారి దయ ఉండాలని వేడుకున్నా: కన్నబాబు

ABN , First Publish Date - 2021-10-09T19:49:13+05:30 IST

గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

రైతాంగంపై అమ్మవారి దయ ఉండాలని వేడుకున్నా: కన్నబాబు

అమరావతి: గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పూర్తిగా తగ్గాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. రైతాంగంపై అమ్మవారి దయ ఉండాలని వేడుకున్నానన్నారు. దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారన్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. తొలిసారిగా 70 కోట్ల రూపాయలు గుడి అభివృద్ధికి కేటాయించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దుర్గ గుడి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-09T19:49:13+05:30 IST