కాణిపాకం బ్రహ్మోత్సవాల తేదీల ఖరారు

ABN , First Publish Date - 2020-08-08T22:54:10+05:30 IST

కాణిపాకం బ్రహ్మోత్సవాల తేదీల ఖరారు

కాణిపాకం బ్రహ్మోత్సవాల తేదీల ఖరారు

చిత్తూరు: ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 11 వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా  అనుసరించాలన్నారు. ప్రతిరోజు స్వామివారికి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. గ్రామోత్సవంను నిలిపివేసి  ఆలయ ప్రాకారంలోని వాహన సేవలు నిర్వహించాలని ఆయన చెప్పారు. వినాయక చవితి రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. 60 ఏళ్ళు పైబడి 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకు  దర్శన భాగ్యం లేదన్నారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో దర్శనం  టికెట్లు విక్రయించాలని కలెక్టర్ సూచించారు. గట్టి పోలీసు భద్రతను కల్పిస్తామన్నారు. 

Updated Date - 2020-08-08T22:54:10+05:30 IST