తిరుమల: ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ (VIP Break) సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లు అందజేశారు. అనంతరం కంగనా రనౌత్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తమ ‘ధాకడ్’ సినిమా విజయవంతమవ్వాలని శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు తెలిపారు. ప్రేక్షకులందరూ ధాకడ్ సినిమాను ఆదరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి