విద్యార్థులను వేగవంతంగా తరలించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి: కనకమేడల

ABN , First Publish Date - 2022-03-02T20:19:49+05:30 IST

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్‌వర్మను కలిశారు.

విద్యార్థులను వేగవంతంగా తరలించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి: కనకమేడల

న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్‌వర్మను కలిశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వేగవంతంగా తరలించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నామన్నారు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌, హెల్ప్‌లైన్‌ నంబర్ల ద్వారా సేకరించిన.. తెలుగు సహా ఇతర విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు అందజేశామన్నారు.


ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న నాలుగు దేశాల్లో టీడీపీ ఎన్ఆర్ఐ సెల్స్ పనిచేస్తున్నాయని ఎంపీ కనకమేడల తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడొద్దన్నారు. విద్యార్థుల తరలింపుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల వివరాలు తెలుసుకోవడం.. కేంద్రంతో సమన్యం చేసుకోవడంలో వైఫల్యం చెందిందన్నారు. ఢిల్లీలో నామమాత్రంగా ఏర్పాట్లు చేసి విద్యార్థులను తరలిస్తున్నామంటున్నారని, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకంటే.. రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కనకమేడల తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-03-02T20:19:49+05:30 IST