కలల రాణి కమలమ!
ABN , First Publish Date - 2020-12-23T06:03:29+05:30 IST
నచ్చిన చినదాని అందాన్ని, ఆమెను చూడగానే మదిలో కలిగిన భావాలను పాటగా మలిచి వినిపిస్తే... ఏ ప్రేమికురాలైన ఒప్పుకోకుండా ఉంటుందా..
నచ్చిన చినదాని అందాన్ని, ఆమెను చూడగానే మదిలో కలిగిన భావాలను పాటగా మలిచి వినిపిస్తే... ఏ ప్రేమికురాలైన ఒప్పుకోకుండా ఉంటుందా... ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న బిఎస్ క్రియేషన్స్ మ్యూజిక్ వారి తాజా జానపద గీతం కట్టాపొంటి పోయెటి కమలమ ఓ కమలమ పాట కూడా ప్రేమికుల భాసలకు అద్దంపట్టేదే.
కట్టాపొంటపోయేటి కమలమ ఓ కమలమ
నీ కాలిగజ్జె ఘల్లుమనే కమలమ ఓ కమలమ
నా ఎడమ కన్ను అదరవట్టే కమలమ ఓ కమలమ
నాకెక్కల్లేని సుట్టమొచ్చె కమలమ ఓ కమలమ
కమలమ ఓ కమలమ ఖతర్నాక్ కమలమ
ఓ కంట జూడే కమలమ నా కలల రాణి నీవమ్మ
బిఎస్ క్రియేషన్స్ మ్యూజిక్ వారు ఈ వీడియోగను రూపొందించారు. నవీన్ యాదవ్ (నాని) రచన, బొడ్డు దిలీప్ కుమార్ పాడిన ఈ పాటకు డీజే శ్రీకాంత్ చీకటిమామిడి సంగీతం అందించాడు. పల్లెటూరి అందాల నడుమ తెరకెక్కించిన ఈ పాటలో విక్కీ, రాజేశ్వరి నటన ఆకట్టుకుంటుంది. యూట్యూబ్లో ఇప్పటి వరకు పది లక్షల వ్యూస్ సాధించిన ఈ పాట పెళ్లి వేడుకల్లో దుమ్మురేపుతోంది.