Bimbisara: మంచి కథ వస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటిస్తా: కల్యాణ్‌రామ్‌

ABN , First Publish Date - 2022-08-01T01:24:59+05:30 IST

మంచి కథ వస్తే తప్పకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటిస్తానని ‘బింబిసార’ (Bimbisara) చిత్రం హీరో కల్యాణ్‌రామ్‌

Bimbisara: మంచి కథ వస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటిస్తా: కల్యాణ్‌రామ్‌

తిరుమల: మంచి కథ వస్తే తప్పకుండా జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటిస్తానని ‘బింబిసార’ (Bimbisara) చిత్రం హీరో కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నటుడు శ్రీనివాస్‌రెడ్డి, కెమెరామెన్‌ చోటా కే నాయుడితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు5వ తేదీన తమ బింబిసార చిత్రం విడుదల కానున్నట్టు తెలిపారు. చిత్ర యూనిట్‌ సభ్యులందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్టు చెప్పారు. 2024లో రాజకీయాల్లో మీపాత్ర ఎలా ఉంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తన చిత్రం గురించి మాట్లాడితేనే బాగుంటుందని దాటవేశారు. అలాగే నటుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తమకు స్వామి ఆశీర్వచనం అయిందని, ఇక ప్రేక్షకుల ఆశీర్వచనమే మిగిలుందన్నారు. తప్పకుండా ప్రేక్షకులు బింబిసారకు మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందన్నారు. అందరూ థియేటర్‌కు వచ్చి చూసి సినిమాను రక్షించాలని కోరారు. 

Updated Date - 2022-08-01T01:24:59+05:30 IST