కాళిదాస్‌ వర్సిటీ వీసీగా నల్లగొండ వాసి

ABN , First Publish Date - 2022-01-12T08:44:06+05:30 IST

సంస్కృతం భాషలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ పెన్నా మధుసూదన్‌..

కాళిదాస్‌ వర్సిటీ వీసీగా నల్లగొండ వాసి

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): సంస్కృతం భాషలో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ పెన్నా మధుసూదన్‌.. కవికుల గురు కాళిదాస్‌ సంస్కృత విశ్వవిద్యాలయానికి (రామ్‌టెక్‌, మహారాష్ట్ర) ఉపకులపతిగా నియమితులయ్యారు. ప్రస్తుత వీసీ రాజీనామా చేయడంతో ఆరు నెలల కాలానికి తనను వీసీగా నియమించారని మధుసూదన్‌ మీడియాకు చెప్పారు. తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన ఆయన.. సంస్కృతంలో పలు రచనలు చేశారు. ఆయన రచించిన ‘ప్రద్నచక్షం’ అనే సంస్కృత ఇతిహాస కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అదే యూనివర్సిటీకి పలుమార్లు ఆయన ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌గా ేసవలందించారు.

Updated Date - 2022-01-12T08:44:06+05:30 IST