లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి మళ్లీ ఎత్తిపోత

ABN , First Publish Date - 2020-02-22T07:57:24+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి శుక్రవారం రాత్రి మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. మొత్తం 11 మోటార్ల...

లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి మళ్లీ ఎత్తిపోత

మహదేవపూర్‌/ జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ నుంచి శుక్రవారం రాత్రి మళ్లీ నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. మొత్తం 11 మోటార్ల ద్వారా 22 వేల క్యూసెక్కులను సరస్వతీ బ్యారేజిలోకి ఎత్తిపోశారు. ఈ నెల 15వ తేదీన పంపింగ్‌ ప్రారంభించినా.. శివరాత్రి జాతర నేపథ్యంలో అధికారులు 19న మోటార్లను బంద్‌ చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ 3, 6వ మోటార్లను ప్రారంభించి 3 వేల క్యూసెక్కులను వరద కాలువకు మళ్లించారు. ఈ నీటిని బాల్కొండ వరకు తరలించనున్నారు. ప్రస్తుతం వరద కాలువకు 4 మీటర్ల ఎత్తులో నీరుంది. 9 మీటర్ల వరకు చేరుకునేదాక ఎత్తిపోయనున్నారు. వరద కాలువ వెంట 34 ఓపెన్‌ తూములుండగా, వాటి ద్వారా 49 చెరువులకు నీటిని తరలిస్తారు.

Updated Date - 2020-02-22T07:57:24+05:30 IST