అమరావతి: కాకినాడ వైసీపీ నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఇటీవల కాకినాడ డీఆర్సీ సమావేశంలో వైసీపీ నేతల మధ్య జరిగిన గొడవపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజ్యసభ ఎంపీ పిల్లి సభాష్ చంద్రబోస్ పరస్పరం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. సమావేశంలో నేతల వ్యవహార శైలిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. దీంతో తనను కలవాలని ఇరువురు నేతలను ముఖ్యమంత్రి పిలిపించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి ద్వారంపూడి చంద్రశేఖర్, పిల్లి సుభాష్ చంద్రబోస్ చేరుకున్నారు. ఇరువురి నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. డీఆర్సీ సమావేశంలో జరిగిన రచ్చపై నేతల దగ్గర నుంచి సీఎం వివరణ తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
నువ్వెవడ్రా.. పోరా!