Abn logo
Aug 7 2021 @ 06:33AM

Kadapa: లారీ-కారు ఢీ..నలుగురు దుర్మరణం

కడప: జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా..క్షతగాత్రులను కడప సర్వజన ఆస్పత్రికి బాధితులను తరలించారు. ఈ ఘటన బ్రహ్మంగారి మఠం మండలం అగ్రహారం దగ్గర చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు: రేష్మ, సద్దామ్ హుస్సేన్, సాల్మ, సాయిలుగా పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వాసులని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు వెల్లడించారు.