Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాల్గరీ కెనడా సాయిబాబా మందిరంలో ఘనంగా కార్తీక దీప వేడుకలు

శ్రీ అనఘా దత్త సొసైటీ వారి ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయి బాబా మందిరంలో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. భగవన్నామస్మరణ కీర్తనలతో, ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా చూపరులను ఆకట్టుకొంది. వెయ్యికి పైగా  దీపాలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలతో ప్రారంభమయ్యి, భగవన్నామస్మరణలు, పూజలు, హారతులతో దైవ ప్రాంగణం అలంకారాలతో కనులవిందుగా నెలకొంది. మధ్యాహ్నహారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణ వ్రతం, జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు పండిట్ రాజకుమార్ శర్మ గారి విశేషానుభవంతో దేవ, దేవి అలంకారాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. పండిట్ రాజకుమార్ శర్మ గారు కార్తీక దీప విశేషాన్ని భక్తులకు వివరించారు. 

కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మందిరంలో శివ, పార్వతి, సాయిబాబా మూర్తులకు అభిషేకం చేశారు. నాలుగు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహుకులు శ్రీమతి లలిత, శైలేష్, ఇతర వలంటీర్లతో ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్దగా, నిర్విఘ్నంగా జరిపించారు. ఆలయ నిర్వహణ కోసం ఎంతో మంది విరాళాలు సమర్పించారు. శ్రీమతి లలిత మాట్లాడుతూ.. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన హైందవ సాంప్రదాయ కొనసాగించాలని హిందూ రక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు. 


TAGS: NRI
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement