ఢిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కేఏ పాల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పవన్ సినిమా డ్రామాలు ఆపాలన్నారు. ఓటు బ్యాంక్ కోసమే పవన్ స్టీల్‌ప్లాంట్ దగ్గర డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ‘‘చిత్తశుద్ధి ఉంటే నా దగ్గరకు రా.. కలిసి పోరాడుదాం.’’ అని సూచించారు. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీకి సపోర్టు చేస్తూ డ్రామాలా? అని ప్రశ్నించారు.