సీఎం జగన్‌పై జ్యోతుల తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2020-02-15T01:56:51+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్‌పై జ్యోతుల తీవ్ర విమర్శలు

కాకినాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం నాడు కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన ఐటీ సోదాల వ్యవహారాన్ని ప్రస్తావనకు తెచ్చారు.


కేవలం 51 వేలు మాత్రమే..!

ఐటీ రైడ్స్‌పై అభూత కల్పనలతో కొన్ని పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. పథకం ప్రకారం జగన్ మాఫియా టీడీపీ, చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తోంది. దేశంలో 40 ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. చంద్రబాబు మాజీ పిఏ శ్రీనివాస్ దగ్గర దొరికింది కేవలం 51 వేలు మాత్రమే. దేశ వ్యాప్తంగా దొరికిన 2 వేల కోట్లు కేవలం శ్రీనివాస్ దగ్గరే దొరికినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు  తప్పించుకునేందుకే పథకం ప్రకారం బురద జల్లుతున్నారుఅని జ్యోతుల విమర్శలు గుప్పించారు.


తీవ్ర విమర్శలు!

ఈడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్ ముందు వాటిపై పారదర్శకంగా వ్యవహరించాలి. నీ తండ్రి హయాంలో తప్పు చేయలేదని చిత్తశుధ్ధితో నిరూపించుకో. చంద్రబాబుపై 26 ఆరోపణలు చేశారు.. ఏ ఒక్కటి నిరూపణ కాకపోగా కొన్ని కేసులు జగన్ ఉపసంహరించుకున్నాడు. నిరాధార ఆరోపణలతో టీడీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసులు ఆరోపణలు ఉన్న అవినీతిపరులకే రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇస్తున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 750 కోట్లు మిగిలాయని అంటున్నారు.. శాండ్ కాస్ట్ పేరుతో 5 వందల కోట్లు దోచిపెట్టారు. ఇప్పటికే పూర్తవ్వాల్సిన పోలవరం మీ అవినీతి వల్లే మరో ఐదేళ్లు వెనక్కి వెళ్లింది. వైసీపీని రాజకీయ పార్టీగా గుర్తించాల్సిన పని లేదు అదోక ముఠా. వైసీపీ నేతలు మాట్లాడే ముందు నోరు శుధ్ధి చేశుకోవాలి. జగన్ ముందు కోర్టుకు హాజరయ్యి చిత్తశుధ్ధిని నిరూపించుకోవాలిఅని జ్యోతుల తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-02-15T01:56:51+05:30 IST