ఐవోఏ నూతన రాజ్యాంగం ఖరారు పర్యవేక్షకుడిగా జస్టిస్‌ నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2022-09-23T09:56:44+05:30 IST

ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ) నూతన రాజ్యాంగం, ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనను పర్యవేక్షించడానికి మాజీ..

ఐవోఏ నూతన రాజ్యాంగం ఖరారు పర్యవేక్షకుడిగా జస్టిస్‌ నాగేశ్వరరావు

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐవోఏ) నూతన రాజ్యాంగం, ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనను పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావును సుప్రీం కోర్టు నియమించింది. ఐవోఏ రాజ్యాంగ సవరణకు జస్టిస్‌ నాగేశ్వరరావు సిఫారసులు చేస్తారని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం గురువారం పేర్కొంది. కాగా.. ఈ నెల 27న జరగనున్న ఐఓసీ సమావేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఐవోఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా, అధ్యక్షుడు అదిల్లే సుమారివాలాను సుప్రీం కోర్టు అనుమతించింది. 

Updated Date - 2022-09-23T09:56:44+05:30 IST