బాధితులకు న్యాయం చేశాం: ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-02-24T02:06:31+05:30 IST

రాష్ట్రంలోని దాదాపు 13,850 కేసుల్లో బాధితులకు ఎస్సీ,ఎస్టీ కమిషన్ ద్వారా న్యాయం

బాధితులకు న్యాయం చేశాం: ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శ్రీనివాస్

హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 13,850 కేసుల్లో బాధితులకు ఎస్సీ,ఎస్టీ కమిషన్  ద్వారా న్యాయం చేయించగలిగామని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లో ఉన్న విధానం దేశంలో ఎక్కడా లేదని రాజస్థాన్ మెచ్చుకుందని ఆయన తెలిపారు. దళిత వర్గాలకు చేయాల్సినవన్నీ కమిషన్ ద్వారా చేసామని ఆయన పేర్కొన్నారు. దళిత వర్గాలకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. బాధితులకు 82 కోట్ల పరిహారాన్ని కమిషన్ ద్వారా ఇప్పించామని ఆయన తెలిపారు. పరిహారం ఇప్పించడంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆయన పేర్కొన్నారు. 13,850 కేసుల్లో ఎస్సీ,ఎస్టీ కమిషన్ ద్వారా న్యాయం చేయించగలిగామన్నారు.


సీఎం కేసీఆర్ నియోజవర్గంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎకరం భూమిని, సహాయ సహకారాలను దగ్గరుండి అందించామని ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు నీళ్ల బాటిల్ కొనే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ అట్రాసిటీ కేసులపై అవగాహన పెంచామని ఆయన పేర్కొన్నారు. కులం పేరుతో దూషించేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2021-02-24T02:06:31+05:30 IST