తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ భుయాన్‌

ABN , First Publish Date - 2021-10-06T08:48:24+05:30 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ భుయాన్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయ శాఖ 
  • కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం


న్యూఢిల్లీ/హైదరాబాద్‌ అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ భుయాన్‌ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. వివిధ హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజయం ఇటీవలే చేసిన సిఫారసుల్లో 15 ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దాంతో మంగళవారం కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా అసోంకు చెందిన జస్టిస్‌ భుయాన్‌ 1964 ఆగస్టు 2న గువహటిలో జన్మించారు.  


ఏపీకి అమానుల్లా, తిన్హారీ  

పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహ్‌సనుద్దీన్‌ అమానుల్లాను, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్‌ తిన్హారీని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎ్‌సఎస్‌ రామచంద్ర రావు పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 

Updated Date - 2021-10-06T08:48:24+05:30 IST