తీర్పులు-మార్పులు పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-05-17T10:35:55+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వెలువరించిన కీలక తీర్పులు, న్యాయవ్యవస్థలో చేపట్టిన సంస్కరణలకు అక్షర రూపం ఇచ్చారు.

తీర్పులు-మార్పులు పుస్తకావిష్కరణ

  • తీర్పులు-మార్పులు పుస్తకావిష్కరణ 
  • సీజేఐ ఎన్వీ రమణ కీలక తీర్పులు, 
  • చేపట్టిన సంస్కరణలకు అక్షర రూపం

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వెలువరించిన కీలక తీర్పులు, న్యాయవ్యవస్థలో చేపట్టిన సంస్కరణలకు అక్షర రూపం ఇచ్చారు. ‘తీర్పులు-మార్పులు’ పేరిట ఈ పుస్తకాన్ని సోమవారం వెలువరించినట్టు రచయిత, ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ తిప్పినేని రామదాసప్పనాయుడు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉమ్మడి ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ మోతీలాల్‌ బీ నాయక్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీజేఐ ఎన్వీ రమణ ‘తీర్పులు-మార్పులు’ పుస్తకాన్ని వెలువరించేందు కు నెలల పాటు శ్రమించినట్టు, అనేక మంది న్యాయకోవిదులు, న్యాయవాదులను కలిసి చర్చలు జరిపినట్లు రామదాసప్పనాయుడు తెలిపారు. ఈ పుస్తకంతోపాటు ‘75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో గిరిజన మహిళల జీవితాలు’ అనే పుస్తకాన్ని సైతం ప్రచురించినట్లు పేర్కొన్నారు.  


Updated Date - 2022-05-17T10:35:55+05:30 IST