పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

ABN , First Publish Date - 2021-06-17T22:15:46+05:30 IST

పిలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించారనే

పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

తిరుపతి: పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నించారనే కారణంతో రాజద్రోహం/దేశద్రోహం తదితర సెక్షన్ల కింద జడ్జి రామకృష్ణను ఏప్రిల్‌ 15న పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదే రోజు రామకృష్ణను రిమాండ్‌కు పోలీసులు తరలించారు. దిగువ కోర్టు బెయిల్‌ తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ విడుదలైనారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. బెయిల్‌ కోసం రూ.50వేల పూచీకత్తుతోపాటు ఇద్దరు షూరిటీ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులు కోరినప్పుడు విచారణకు హాజరవ్వాలని, ఈ కేసుకు సంబంధించి మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

Updated Date - 2021-06-17T22:15:46+05:30 IST