బైడెన్-పుతిన్ మీటింగ్ సమయంలో.. జర్నలిస్టుల తోపులాట

ABN , First Publish Date - 2021-06-17T05:25:00+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం జెనీవాలో జరిగింది. ఈ సమావేశం జరిగిన గదిలోకి ప్రవేశించే సమయంలో యూఎస్, రష్యా జర్నలిస్టుల మధ్య తోపులాట జరిగింది.

బైడెన్-పుతిన్ మీటింగ్ సమయంలో.. జర్నలిస్టుల తోపులాట

జెనీవా: అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం జెనీవాలో జరిగింది. ఈ సమావేశం జరిగిన గదిలోకి ప్రవేశించే సమయంలో యూఎస్, రష్యా జర్నలిస్టుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తిట్టుకుంటూ, నెట్టుకుంటూ బలవంతంగా ఆ గదిలోకి వెళ్లడానికి జర్నలిస్టులు ప్రయత్నించారు. బుధవారం ఇరుదేశాల అధ్యక్షుల సమావేశం సందర్భంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దానిలో సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులను వెనక్కు పంపేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతర జర్నలిస్టులతో ఘర్షణ పడి గదిలో ప్రవేశించబోయిన వారిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపేశారు. ‘‘అదో పెద్ద గందరగోళం’’ అని ఒక వైట్‌హౌస్ అధికారి తెలిపారు.

Updated Date - 2021-06-17T05:25:00+05:30 IST