జర్నలిస్ట్ రఘు కేసు విచారణ 16కి వాయిదా

ABN , First Publish Date - 2021-06-09T21:57:55+05:30 IST

జర్నలిస్ట్ రఘుపై కేసుల విచారణను ఈనెల 16కి హైకోర్టు వాయిదా

జర్నలిస్ట్ రఘు కేసు విచారణ 16కి వాయిదా

హైదరాబాద్: జర్నలిస్ట్ రఘుపై కేసుల విచారణను ఈనెల 16కి  హైకోర్టు వాయిదా వేసింది. జర్నలిస్ట్ రఘుపై నమోదు చేసిన కేసుల వివరాలను కోర్టుకు సమర్పించాలని డీజీపీని హైకోర్టు అదేశించింది. ఈనెల 14లోగా కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీకి హైకోర్టు సూచించింది. రఘు భార్య లక్ష్మీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రఘు బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ ఉన్నందున కేసుల వివరాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కేసుల వివరాల కోసం డీజీపీకి వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా కేసుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. అనంతరం కేసు విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. 




 సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని గుర్రంబోడు గిరిజన భూముల కేసుల విషయంలో కొన్ని రోజుల క్రితం తొలివెలుగు జర్నలిస్ట్‌ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో అరెస్ట్‌ అయిన అతన్ని హుజూర్‌నగర్‌ కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నల్లగొండ జిల్లా జైలుకు  తరలించారు. 

Updated Date - 2021-06-09T21:57:55+05:30 IST