బెయిర్‌స్టోకు రూ. 6.5 కోట్ల నష్టం

ABN , First Publish Date - 2020-10-01T09:28:57+05:30 IST

టెస్టుల్లో చోటు దక్కించుకోగలననే ఆశాభావంతో ఉన్న ఇంగ్లం డ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోకు ఊహించని షాక్‌ తగిలింది...

బెయిర్‌స్టోకు రూ. 6.5 కోట్ల నష్టం

లండన్‌: టెస్టుల్లో చోటు దక్కించుకోగలననే ఆశాభావంతో ఉన్న ఇంగ్లం డ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోకు ఊహించని షాక్‌ తగిలింది. వచ్చే ఏడాదికిగాను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ టెస్టు ప్లేయర్ల జాబితా నుంచి బెయిర్‌స్టోను తప్పించింది. ఫలితంగా బెయిర్‌స్టో రూ. 6.5 కోట్ల భారీ మొత్తాన్ని నష్టపోనున్నాడు. టెస్టు జాబితాలో నిరాశ ఎదురైనా, అతనికి పరిమిత ఓవర్ల కాంట్రాక్టు మాత్రం దక్కింది. ఇక, ఇటీవలి కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఓలీ పోప్‌, జాక్‌ క్రాలే, సిబ్లేకు మళ్లీ టెస్టు కాంట్రాక్ట్‌లు లభించాయి. 

Updated Date - 2020-10-01T09:28:57+05:30 IST