భూమిలోనుంచి బయటకు వస్తున్న పాములు

ABN , First Publish Date - 2021-03-04T20:35:55+05:30 IST

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20కి పైగా పాము పిల్లలు భూమిలోంచి బయటకు వచ్చాయి.

భూమిలోనుంచి బయటకు వస్తున్న పాములు

గద్వాల జిల్లా: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20కి పైగా పాము పిల్లలు భూమిలోంచి బయటకు వచ్చాయి. అది కూడా నిత్యం ప్రజలు తిరిగే రోడ్డు పక్కన. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వెంకటాపురంలో రోడ్డుపక్కన మిషన్ భగీరథ కోసం గొయ్యి తీసి పూడ్చివేశారు. అందులోనే పాము గుడ్లను పెట్టింది. మొదట ఈ గొయ్యి నుంచి పాము పిల్ల బయటకు వచ్చింది. స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఒకదాని వెనుక ఒకటి ఇలా 20కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. అయితే ఈ పాము పిల్లలను చంపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిసరాల్లోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత గొయ్యిని తవ్విన స్థానికులకు అందులో మరిన్ని పాము గుడ్లు కనిపించాయి. వాటిని ధ్వంసం చేసి గొయ్యిని పూడ్చివేశారు. అయితే తప్పించుకున్న పాములు ఇళ్లల్లోకి వచ్చి కాటేస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-03-04T20:35:55+05:30 IST