మరో రికార్డు సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

ABN , First Publish Date - 2021-08-29T02:09:11+05:30 IST

భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భీకర ఫామ్‌తో అదరగొడుతున్న ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఖాతాలోకి మరో రికార్డు

మరో రికార్డు సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్

లీడ్స్: భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భీకర ఫామ్‌తో అదరగొడుతున్న ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేనపై ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించిన రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. కెప్టెన్‌గా రూట్ 55 టెస్టుల్లో 27 విజయాలు అందించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మైకేల్ వాన్ (51 టెస్టుల్లో 26 విజయాలు), ఆండ్రూస్ట్రాస్ (50 టెస్టుల్లో 24 విజయాలు), అలిస్టర్ కుక్ ( (59 టెస్టుల్లో 24 విజయాలు), పీటర్ మే (41 టెస్టుల్లో 20 విజయాలు) ఉన్నారు. 

Updated Date - 2021-08-29T02:09:11+05:30 IST