భారతీయ అమెరికన్ గౌతమ్‌ రాఘవన్‌కు పదోన్నతి.. White House లో కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2021-12-12T13:08:40+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో భారత అమెరికన్‌కు శ్వేతసౌధంలో కీలక బాధ్యతలు అప్పగించారు.

భారతీయ అమెరికన్ గౌతమ్‌ రాఘవన్‌కు పదోన్నతి.. White House లో కీలక బాధ్యతలు

వాషింగ్టన్‌, డిసెంబరు 11: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో భారత అమెరికన్‌కు శ్వేతసౌధంలో కీలక బాధ్యతలు అప్పగించారు. రాజకీయ సలహాదారు అయిన గౌతమ్‌ రాఘవన్‌ను వైట్‌ హౌస్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ ఆఫీస్(పీపీవో) డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. ఆయన భారత్‌లో జన్మించారు. సియాటెల్‌లో పెరిగారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌ పీపీవో డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, శ్వేతసౌధం సీనియర్‌ అధికారి కేథరిన్‌ రసెల్‌ ఐక్యరాజ్యసమితి(ఐరాస) చిల్డ్రన్స్‌ ఫండ్‌(యునిసెఫ్‌) సారథిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సలహాదారు, వైట్‌ హౌస్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌ ఆఫీ్‌స(పీపీవో) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆమెను.. యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటానియో గ్యుటెరిస్‌ శుక్రవారం ప్రకటించారు.  

Updated Date - 2021-12-12T13:08:40+05:30 IST