వచ్చేస్తున్న JioPhone Next.. మీరు సిద్ధమా?

ABN , First Publish Date - 2021-08-28T02:44:27+05:30 IST

టెలికం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన అత్యంత

వచ్చేస్తున్న JioPhone Next.. మీరు సిద్ధమా?

న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన అత్యంత చవక స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్స్ట్’ ముందస్తు బుకింగులకు సమయం దగ్గర పడింది. సెప్టెంబరు 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగులు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. జియోఫోన్ నెక్స్ట్‌ను రియల్స్ జియో, గూగుల్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దేశంలో ఇంకా ఫీచర్‌ ఫోన్‌కే పరిమితమైన కోట్లాదిమందికి స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ ఫోన్ కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  


జియో నెక్స్ట్‌ ప్రి బుకింగ్స్ వచ్చే వారం ప్రారంభం కానున్నట్టు జియో వర్గాల ద్వారా తెలుస్తోంది. ముందస్తు బుకింగుల కోసం రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్టు జియో పేర్కొంది. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇది అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ కాబోతోందని టెలికం వర్గాలు చెబుతున్నాయి. ధర గరిష్టంగా రూ. 3,499 ఉండే అవకాశం ఉంది.

 

జియో ఫోన్ నెక్స్ట్ స్పెసిఫికేషన్లు:  ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్), 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ క్యూఎం215 ఎస్ఓసీ, 2జీబీ/3జీబీ ర్యామ్ వేరియంట్లు, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ ఆప్షన్లు, వెనకవైపు 13 ఎంపీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ వి4.2, జీపీఎస్ కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంది. 


Updated Date - 2021-08-28T02:44:27+05:30 IST