రూ.23 వేల కోట్ల అమెజాన్ షేర్లు అమ్మేసిన జెఫ్ బెజోస్!

ABN , First Publish Date - 2020-08-07T02:10:49+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తాజాగా దాదాపు 23 వేల కోట్ల రూపాలయల(3.1 బిలియన్) డాలర్ల విలువైన అమెజాన్ షేర్లను అమ్మేశారు.

రూ.23 వేల కోట్ల అమెజాన్ షేర్లు అమ్మేసిన జెఫ్ బెజోస్!

వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ తాజాగా దాదాపు 23 వేల కోట్ల రూపాయల(3.1 బిలియన్ డాలర్లు)విలువైన అమెజాన్ షేర్లను అమ్మేశారు. దీని ద్వారా ఆయన 2.4 బిలియన్ డాలర్లను(పన్ను చెల్లింపుల అనంతరం) సేకరించారు. అయితే ఇప్పటివరకూ ఆయన సంస్థలో తనకున్న 7.2 బిలయన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసారు. తను ఏర్పాటు చేసిన అంతరీక్షరంగం సంస్థ బ్లూ ఆరిజిన్‌కు నిధులు సమకూర్చేందుకే బెజోస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిధుల కోసం ఏటా కనీసం ఒక బిలియన్ డాలర్ల షేర్లను అమ్ముతానంటూ బెజోస్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. అంతరీక్షరంగంలో ప్రత్యేక ముద్రవేసేందుకు ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్, జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 

Updated Date - 2020-08-07T02:10:49+05:30 IST