వెన్నెలకు జేజేలు!

ABN , First Publish Date - 2022-05-20T09:13:40+05:30 IST

తగ్గిపోతున్న భూసారాన్ని పరిరిక్షించేందుకు..., రైతులు, సామాన్యులను భూసార పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యులను చేయడానికి ఓ బాలిక నడుం బిగించింది.

వెన్నెలకు జేజేలు!

భూసార పరిరక్షణకు బాలిక సైకిల్‌ యాత్ర

కుక్కునూరు, మే 19: తగ్గిపోతున్న భూసారాన్ని పరిరిక్షించేందుకు..., రైతులు, సామాన్యులను భూసార పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యులను చేయడానికి ఓ బాలిక నడుం బిగించింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మామిరెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన 15 ఏళ్ల బానోతు వెన్నెల సైకిల్‌ యాత్ర చేపట్టింది. ఈనెల ఒకటిన మొదలైన సైకిల్‌ యాత్ర 23 జిల్లాల్లో 1450 కిలోమీటర్లు సాగి, భద్రాచలం మీదుగా గురువారం ఆంధ్రలోని కుక్కునూరుకు చేరుకుంది. మార్గమధ్యలో ప్రజలకు, రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నట్టు వెన్నెల తెలిపింది. గతేడాది పదవ తరగతి పూర్తి చేయగా రాక్‌ క్లైంబింగ్‌లో శిక్షణ పొందుతూ ఈ సైకిల్‌ యాత్ర మొదలు పెట్టానని, విశాఖపట్నం వెళ్తున్నట్టు చెప్పింది. కాగా చిన్నారి చేపట్టిన యాత్రను ప్రశంసిస్తూ ఎంపీపీ గీతావాణి, సర్పంచ్‌ రావు మీన, వైసీపీ నాయకులు నరసింహరాజు, సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు కుక్కునూరు పోలీస్టేషన్‌లో సన్మానించారు. అనంతరం మార్గంమధ్యలో ఖర్చుల నిమిత్తం రూ.10వేల ఆర్థిక సాయం అందించారు.

Updated Date - 2022-05-20T09:13:40+05:30 IST