సీఎం జగన్ కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థలపై పడింది: జవహర్

ABN , First Publish Date - 2021-09-13T20:27:23+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యా సంస్థలపై పడిందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు.

సీఎం జగన్ కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థలపై పడింది: జవహర్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను ఎయిడెడ్ విద్యా సంస్థలపై పడిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిడెడ్ సంస్థలను ‘డెడ్’ చేయడమే జగన్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని విమర్శించారు. బ్రిటీష్ హయాం నుంచి, దాతల సహాయ సహకారంతో నడుస్తున్న విద్యా సంస్థలను స్వాధీనం చేసుకొనే హక్కు సీఎంకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్య కోసం దాతలిచ్చిన భూములు, భవనాలను ప్రైటేట్ పరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. నాడు-నేడు కింద ఎయిడెడ్ విద్యా సంస్థల్లో కూడా ప్రభుత్వం ఎందుకు తగిన వసతులు కల్పించడంలేదని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న.. 90 శాతం మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని జవహర్‌ అన్నారు.

Updated Date - 2021-09-13T20:27:23+05:30 IST