లుకేమియాను జయించి.. ఒలింపిక్‌ బెర్త్‌ సాధించి..

ABN , First Publish Date - 2021-04-05T10:15:00+05:30 IST

జపాన్‌ స్విమ్మర్‌ రికాకో ఇకీ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారు కదూ.

లుకేమియాను జయించి..  ఒలింపిక్‌ బెర్త్‌ సాధించి..

టోక్యో: పాన్‌ స్విమ్మర్‌ రికాకో ఇకీ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారు కదూ. అవును ఆమెది స్పెషాల్టీయే. 20 ఏళ్ల రికాకో రెండేళ్ల కిందట లుకేమియా బారిన పడింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె గత సంవత్సరం మళ్లీ పూల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన జపాన్‌ జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో 100 మీ. బట్టర్‌ఫ్లై ఈవెంట్‌ను 57.77 సెకన్లతో పూర్తి చేసి ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నది.  

Updated Date - 2021-04-05T10:15:00+05:30 IST