జనగామ: జిల్లాలోని జఫర్ ఘడ్ మండలం తీగారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలనెపంతో గోరేమియా కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. కాగా... గ్రామస్తులు నిలువరించడంతో గోరేమియా, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి