5 రోజులు..90కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌ వెంటే..

ABN , First Publish Date - 2020-04-03T06:49:38+05:30 IST

ఆ వృద్ధుడు తన కూతుర్ని చూద్దామని వెళ్లాడు. జనతా కర్ఫ్యూ వల్ల మధ్యలోనే చిక్కుబడిపోయాడు. రవాణా స్తంభించడంతో రైల్వేట్రాక్‌ వెంట తిరుగు దారి పట్టాడు. సొమ్మసిల్లి పడిపోయాడు.

5 రోజులు..90కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌ వెంటే..

నడిచి నడిచి సొమ్మసిల్లిన 70ఏళ్ల వృద్ధుడు


గార్ల, ఏప్రిల్‌ 2: ఆ వృద్ధుడు తన కూతుర్ని చూద్దామని వెళ్లాడు. జనతా కర్ఫ్యూ వల్ల మధ్యలోనే చిక్కుబడిపోయాడు. రవాణా స్తంభించడంతో రైల్వేట్రాక్‌ వెంట తిరుగు దారి పట్టాడు. సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ ఘటన మద్దివంచ అటవీ ప్రాంతంలో జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా పెనగంచిప్రోలుకు చెందిన చల్లా అనుమయ్య(70) కుమార్తె తెలంగాణలోని హన్మకొండలో ఇటుక బట్టీల్లో పనిచేస్తోంది. ఆమెను చూసేందుకు హన్మకొండకు చేరుకున్న అనుమయ్య లాక్‌డౌన్‌ కారణంగా కూతురు వద్దకు వెళ్లలేకపోయాడు. ఖాజీపేటకు చేరుకుని రైలు పట్టాల వెంబడి నడక మొదలెట్టాడు. ఏకంగా ఐదు రోజుల పాటు 90 కిలోమీటర్లు నడిచాడు. ఆరోగ్యం క్షీణించి.. మానుకోట జిల్లా గార్ల-మద్దివంచ అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లాడు. వీఆర్వో అశోక్‌, వైస్‌-ఎంపీపీ కె.శ్రీనివా్‌స అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-04-03T06:49:38+05:30 IST