Advertisement
Advertisement
Abn logo
Advertisement

పవన్ ఓటు వేసేది ఎక్కడంటే?

ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వినియోగించుకోనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రేపు ఉదయం 7 నుంచి 8గంటల మధ్య ఓటు వేయనున్నారు. పటమట లంకలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూల్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేస్తారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.  


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనపడితే చాలు... ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడతారు. వాళ్లను కంట్రోల్ చేయాలంటే పోలీసులకు తల ప్రాణం తోకకు వస్తుంది. అలాంటిది ఆయన రేపు ఓటు వేయనున్న సందర్భంగా... స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement