Common wealth gamesలో భారత విజయాలు సంతోషదాయకం: పవన్
ABN , First Publish Date - 2022-08-09T18:48:46+05:30 IST
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత విజయాలు సంతోషదాయకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత విజయాలు సంతోషదాయకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.... పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) పోటీల్లోనూ ఈ విజయం కొనసాగాలని ఆకాంక్షించరాు. బ్రిటన్లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్(Common wealth games)లో పతకాలు సాధించిన క్రీడాకారులకు, ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనసేనాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను మన క్రీడాకారులు సాధించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. పతకాల పట్టికలో భారత్(India) నాలుగో స్థానంలో నిలవడం గొప్పగా అనిపించిందని తెలిపారు. ఈ పోటీలలో మన తెలుగు బిడ్డలు పతకాల పంట పండించడం మనందరికీ గర్వకారణమన్నారు. 2024లో పారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలలో ఈ జైత్రయాత్ర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు.