జగిత్యాల: మెట్పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కూతురితో సహా వరద కాలువలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆత్మనగర్లో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి శనివారం తల్లి, కూతురు వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున కాలువలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను బయటికి తీశారు. మృతులు ఆత్మనగర్కు చెందిన వనజ(28), శాన్వి(6)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.