Abn logo
Oct 28 2021 @ 15:44PM

మరోసారి ఆ మాట అంటే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి

హైదరాబాద్: వరి సాగుపై బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాల డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు డ్రామాలు బంద్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతుందని, నవంబర్1 తర్వాత చలో సిద్దిపేట చేపడతామని తెలిపారు. మంత్రులు ప్రతిపక్షాలను రండలు అని తిట్టొచ్చా? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన మాట్లాడితే తాము రండలమా?, మరి మీరు కేసీఆర్ కోసం రండలా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల కోసం తాము తిట్లు తినడానికి సిద్ధమన్నారు. వరి కొనకపోతే మంత్రులను అడ్డుకుంటామన్నారు. మరొక సారి రండలు అంటే నాలుక కోస్తామన్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. లేదంటే నడిరోడ్డు మీద బట్టలు విప్పిస్తామన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...

క్రైమ్ మరిన్ని...