అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో పోల్చి.. ఎక్కడెక్కడ ఎలా నష్టపోయామో లెక్కలు వేసుకుంటున్నారు. అప్పట్లో ఆదాయం తగ్గినా చంద్రబాబే జీతాలు పెంచారని, ఇప్పుడు ఆదాయం పెరిగినా జగన్ జీతాలు కోసారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన పీఆర్సీకి, జగన్ పీఆర్సీకి మధ్య తేడాలు పోల్చి చూస్తున్నారు.