కరోనా ఆస్పత్రుల్లో త్వరగా వసతులు కల్పించాలని జగన్‌ ఆదేశం

ABN , First Publish Date - 2020-04-09T00:43:05+05:30 IST

కరోనా ఆస్పత్రుల్లో త్వరగా వసతులు కల్పించాలని జగన్‌ ఆదేశం

కరోనా ఆస్పత్రుల్లో త్వరగా వసతులు కల్పించాలని జగన్‌ ఆదేశం

అమరావతి: కరోనా ఆస్పత్రుల్లో త్వరగా వసతులు కల్పించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే మూడోసారి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. 6,289 మందికి జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు బయటపడ్డాయని అధికారులు, సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన సీఎం, క్వారంటైన్‌లో మందులను అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ పరిస్థితులు, ధరలపై యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులు ఉంటే 1902కు కాల్‌ చేయాలని కోరారు. అర్హత ఉన్నవారికి రేషన్‌, రూ. వెయ్యి కచ్చితంగా అందజేయాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు 1.36 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్‌, 1.22 కోట్ల కుటుంబాలకు రూ.వేయి పంపిణీ చేశామని జగన్, అధికారులు వివరించారు.

Updated Date - 2020-04-09T00:43:05+05:30 IST