పీవీ సింధుకి రూ.5 లక్షల చెక్ అందజేసిన జగన్
ABN , First Publish Date - 2021-06-30T18:18:11+05:30 IST
అకాడమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించినందుకు సీఎం జగన్‌కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి: అకాడమీ ఏర్పాటుకు రెండెకరాల భూమి కేటాయించినందుకు సీఎం జగన్‌కు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు. జులై 23 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున పాల్గొనబోతున్న ఒలింపియన్స్ పీవీ సింధు, ఆర్.సాత్విక్ సాయిరాజ్, రజనీలకు జగన్ విషెస్ తెలిపారు. ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్‌ను అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ ప్లేయర్), బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు జగన్‌ను కలిశారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.