జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ?: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-02-14T21:00:51+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ?: చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాజీనామాలపై నాటి మీ సవాళ్లు ఏమయ్యాయని నిలదీశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎజెండాలో ప్రత్యేక హోదా తమ ఘనతే అని చెప్పుకుని.. ఇప్పుడు తమపై బురద జల్లుతారా? అని ప్రశ్నించారు. ఏపీ ఆదాయం తగ్గకపోయినా ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. లేని సమస్యను సృష్టించి జగన్‌రెడ్డి సినీ హీరోలను అవమానించారని తప్పుబట్టారు.


స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్‌ని ప్రాధేయపడాలా? అని ప్రశ్నించారు. తెలుగు సినిమా పరిశ్రమని జగన్‌రెడ్డి కించపరిచారని దుయ్యబట్టారు. విద్యార్థులకు బడులను దూరం చేయడమే నాడు నేడు పథకమా? అని ప్రశ్నించారు. కరెంట్ సరఫరా లేదు కానీ.. అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని, మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-14T21:00:51+05:30 IST