సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ABN , First Publish Date - 2021-06-04T22:51:03+05:30 IST

సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి.

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి. పీఆర్ ఎనర్జీపై అభియోగాల నమోదుపై విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. ఈడీ కేసులపై విచారణ ఈనెల 22కి కోర్టు వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ చార్జ్‌షీట్ విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. అక్రమాస్తుల కేసుల్లో బెయిలుపై ఉన్న జగన్‌కు జారీచేసిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత వ్యాజ్యాన్ని సాంకేతిక కారణాలపై సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో రఘురామ మరో వారం తర్వాత సవరించిన వ్యాజ్యాన్ని మరోసారి దాఖలు చేశారు. సీఎంపై అక్రమాస్తులకు సంబంధించి 11 కేసులు ఉన్నాయని, అన్నింటిలోనూ జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. ఆయనకు జారీచేసిన బెయిలు రద్దు చేయాలని పిటిషనర్‌ కోరారు.

Updated Date - 2021-06-04T22:51:03+05:30 IST