సమ్మెకు వెళ్లాలని వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-31T22:07:30+05:30 IST

వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తొలుత ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలా? వద్దా? అని వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం నేతలు

సమ్మెకు వెళ్లాలని వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ నిర్ణయం

అమరావతి: వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తొలుత ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలా? వద్దా? అని వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం నేతలు తర్జన భర్జనలో పడ్డారు. తర్వాత సమ్మెకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు సమర శంఖం పూరించాయి. వచ్చేనెల 7నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు ప్రకటించాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ జీవోలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 24న సీఎస్‌ సమీర్‌ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (ఫిబ్రవరి-7) సమ్మెలోకి వెళ్లనున్నట్లు నోటీసులో హెచ్చరించనున్నట్టు చెప్పారు.

Updated Date - 2022-01-31T22:07:30+05:30 IST