బ్రేకింగ్: ఏబీఎన్ చేతికి ఐటీ శాఖ పంచనామా నివేదిక

ABN , First Publish Date - 2020-02-16T15:00:46+05:30 IST

గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఐటీ రైడ్స్ అంశానికి సంబంధించిన కీలక ఆధారాలు

బ్రేకింగ్: ఏబీఎన్ చేతికి ఐటీ శాఖ పంచనామా నివేదిక

అమరావతి: గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఐటీ రైడ్స్ అంశానికి సంబంధించిన కీలక ఆధారాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి లభ్యమయ్యాయి. రెండు వేల కోట్ల రూపాయలు భారీ ఆస్తులు టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో లభ్యమయ్యాయంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.


ఆ ఆరోపణలు అవాస్తవమని తేల్చే ఐటీ పంచనామా నివేదిక బయటపడింది. శ్రీనివాస్ ఇంట్లో కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం దొరికినట్టు ఐటీ శాఖ పంచనామా తేల్చింది. శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సోదాల్లో లభ్యమైన బంగారు ఆభరణాలను సీజ్ చేయలేదని అధికారులు పేర్కొన్నారు. పంచనామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. 





Updated Date - 2020-02-16T15:00:46+05:30 IST