వయో వృద్ధులకు ఊరట

ABN , First Publish Date - 2021-09-06T07:28:16+05:30 IST

ఆదాయ పన్ను (ఐటీ) పరిధిలోకి వచ్చే వయోవృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌ బాదరబంది నుంచి వీరికి విముక్తి కల్పించింది...

వయో వృద్ధులకు ఊరట

  • 75 దాటితే రిటర్న్స్‌ ఫైలింగ్‌ నుంచి మినహాయింపు

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) పరిధిలోకి వచ్చే వయోవృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌ బాదరబంది నుంచి వీరికి విముక్తి కల్పించింది. జీవిత చరమాంకంలో ఉన్న 75 లేదా అంతకు  మించి వయసున్న వయోవృద్ధులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ చర్య ద్వారా ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విడుదల చేసింది. పెన్షన్‌ ఖాతా, వడ్డీ ఆదాయం వచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకే బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఉన్న వయోవృద్ధులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.



ఇతర ప్రధాన నిబంధనలు

  1. ఒకే బ్యాంక్‌ బ్రాంచ్‌లో పెన్షన్‌ ఖాతా, వడ్డీ ఆదాయం వచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతా ఉండాలి.
  2. సీనియర్‌ సిటిజన్లు ఫారం-12బీబీఏలో తమ పెన్షన్‌, వడ్డీ ఆదాయ వివరాలను తమకు ఖాతా ఉన్న బ్యాంక్‌ బ్రాంచ్‌కు సమర్పించాలి.
  3. బ్యాంక్‌ బ్రాంచ్‌ సీనియర్‌ సిటిజన్ల ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను మినహాయించి ప్రభు త్వ ఖాతాలో జమ చేస్తుంది.
  4. సీనియర్‌ సిటిజన్ల నుంచి ఫారం-12బీబీఏలో ఈ వివరాలు స్వీకరించేందుకు ప్రతి బ్యాంక్‌ బ్రాంచ్‌లో ప్రత్యేక కౌంటర్లు.
  5. అవసరమైతే సీనియర్‌ సిటిజన్ల ఫారం-12బీబీఏలను బ్యాంక్‌ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి స్వీకరించే సౌలభ్యం.

Updated Date - 2021-09-06T07:28:16+05:30 IST